Sangeetha | సీనియర్ హీరోయిన్ సంగీత గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. హీరోయిన్గా కెరీర్ ముగిసిన తర్వాత కూడా వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈమె నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి విషయమై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. (File/Photo)
హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ మూవీలో ‘ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి అడిగే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టిన సంగీత... ఆ తర్వాత ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘విజయేంద్రవర్మ’, ‘సంక్రాంతి’ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది.(File/Photo)
బాల దర్శకత్వంలో రూపొందిన ‘శివపుత్రుడు’ సినిమాలో సంగీత పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న సంగీత...అప్పట్లో ఓ వివాదాల్లో ఇరుక్కుంది. ఈ వివాదానికి సంగీత తల్లి భానుమతి బాలన్ ఆమెపై చేసిన ఆరోపణలే. సంగీత, ఆమె తల్లి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. సంగీత తన భర్తతో కలిసి పై అంతస్థులో ఉంటుంటే... కింది అంతస్థులో తల్లి, ఆమె పెద్ద కుమారుడి కుటుంబం ఉంటోంది.(File/Photo)
కొన్నాళ్ల క్రితం సంగీత తమ్ముడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటినుంచి తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని సంగీత, ఆమె భర్త క్రిష్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది భానుమతి బాలన్. వృద్ధాప్యంలో ఉన్న భానుమతి ఇలా బయటికి వచ్చి, సంగీత గురించి ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేగింది. (File/Photo)
ఇక నా సోదురులు ఇద్దరు తాగుడకు బానిస అయ్యారు. వారి అవసరాల కోసం నన్ను ఏటీమ్ మిషిన్‌లా వాడుకున్నారు. నేను సంపాదించిన డబ్బులతో వాళ్లు ఎంజాయ్ చేసారు. దాన్ని నేను తప్పు పట్టను. కానీ నేను కష్టపడి కట్టుకున్న ఇంట్లో నా తల్లితో పాటు మా బ్రదర్స్ ఉంటున్నారు. నా ఇంట్లో ఉంటూ నా ఇల్లు లాక్కొవాలని ప్రయత్నం చేసారు. అంతేకాదు తనపై దుష్ప్రచారం కూడా చేయడాన్ని తట్టుకోలేకపోయాను. (file/Photo)
ఇక సంగీత సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన సరిలేరు నీకెవ్వరుతో పాటు మసూద వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో సంగీత ఇపుడు గోల్డెన్ లెగ్గా మారింది. ఆమె నటిస్తే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా బలంగా నాటుకు పోయింది. దీంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ఏరికోరి మరి సంగీతకు తమ సినిమాల్లో మంచి పాత్రలు ఇస్తున్నారు. (File/Photo)