Lok Sabha Elections 2019 Karnataka: కన్నడనాట ఓటు హక్కు వినయోగించుకున్న సినీ తారలు..

లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఇక కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో సీఎం కుమారస్వామితో పాటు ఆయన తనయుడు నిఖిల్ గౌడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు సుమలత అంబరీష్,యశ్,దర్శన్,అర్జున్ వంటి హీరోలతో పాటు కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.