Samyuktha Menon: సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon). మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఈ యేడాది పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది. Photo : Twitter
బింబిసార’ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఈమె పాత్రకు అంతగా స్కోప్ లేకున్నా.. ఈమె నటిస్తే హిట్ అన్న సెంటిమెంట్‌తో వరుసగా తెలుగు నిర్మాతలు, హీరోలు ఈమెను తమ సినిమాలో తీసుకుంటారా అనేది చూడాలి. Photo : Twitter
ఇక ఈ భామ బింబిసార తర్వాత తెలుగులో ప్రస్తుతం సార్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైమంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సితార ఎంటర్ట్మెంట్స్ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు తమిళ్లో విడుదలవుతోంది. Photo : Twitter
మలయాళం నుంచి వచ్చే హీరోయిన్లు చాలా త్వరగా క్రేజ్ తెచ్చుకుంటారు. సాధారణంగానే కేరళ అమ్మాయిలు అంటే మన దర్శక నిర్మాతలు కూడా త్వరగానే అవకాశాలు ఇస్తుంటారు. సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్. (Twitter/Photo)