ఈ సినిమా ఒరిజినల్లో సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. ఇక ఇదే సినిమాను ఆయన తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్లో ఆయన చేసిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా.. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా పవన్ గతంలో నటించిన గోపాల గోపాలకు కాస్తా దగ్గరగా ఉంటుంది.