సంపత్ నంది తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో ఈయన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమా ఏమైంది ఈ వేళ తప్పిస్తే.. రచ్చ నుంచి సీటీమార్ వరకు మాస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేస్తూనే ఉన్నాడు. ఈయన ఇపుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. (Twitter/Photo)
సంపత్ నంది ... గతేడాది గోపీచంద్‌తో చేసిన సీటీమార్‌తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్.. రిపబ్లిక్ మూవీ తర్వాత కార్తీక్ దండు అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. మధ్యలో సాయి తేజ్ యాక్సిడెంట్ గురైన మళ్లీ కోలుకున్నాడు. యాక్సిడెంట్లో అయిన గాయాలతో పాటు కాలర్ బోన్ సర్జరీ సమయంలో వచ్చిన సమస్యలతో కొన్ని రోజుల వరకు కాస్త వీక్‌గా ఉన్నాడు తేజు. అందుకే ప్రమాదం తర్వాత దాదాపు రెండు నెలల పాటు సాయి ధరమ్ తేజ్ ఫోటోలు కూడా బయటికి రాలేదు.
సంపత్ నంది విషయానికొస్తే.. ఈయన చిరంజీవి రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. దాంతో పాటు బాలకృష్ణతో ఓ సినిమా కూడా చేయనున్నారు. అటు రవితేజతో విక్రమార్కుడు సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ మూడు సినిమాలకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (Twitter/Photo)