ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. (Twitter/Photo)
ఈ వారం కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం యశోదకు కలిసివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్ ద్వారా యశోద ముప్పై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీక్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. గురువారం నుంచి నిర్మాతలు లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
గే ఈ సినిమాకి సీక్వల్ వుంటుందా అన్న ప్రశ్న కూడా ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుంచి ఒక చర్చ నడుస్తోంది. దీనికి దర్శకులు హరి మరియు హరీష్, అలాగే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు. 'యశోద 2' గురించి చాలా మంది అడుగుతున్నారు కానీ ఈ సీక్వెల్ ప్రయత్నం మాత్రం దర్శకులు హరి, హరీష్ నుంచి రావాలి అని నిర్మాత అనగానే దర్శకులు రెడీ అన్నారు.