సమంత నటించిన “యశోద” మరియు అఖిల్ అక్కినేని “ఏజెంట్” సినిమాలు వాయిదా పడే విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు అనిపించింది. కానీ అఖిల్ అక్కినేని సినిమా నిర్మాణంలో జాప్యం కారణంగా వాయిదా పడింది. తాజాగా సమంత సినిమా యశోద మాత్రం రిలీజ్ అయ్యేందుకు కొత్త డేట్ కోసం వెతుకుతున్నారు. “యశోద” టీజర్ లాంచ్ ఎప్పుడో జరిగింది. కానీ ఇది ఇప్పటివరకు ఎటువంటి సంచలనం లేదా హైప్ క్రియేట్ చేయలేదు.
ఈ సారి ఎలాగైనా బ్లాక్బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు.
పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో పిచ్చెక్కిస్తుంది స్యామ్. అందులో భాగంగానే ‘యశోద’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శక ద్వయం హరి, హరీశ్ తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నిర్మాత శివలెంత కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత ప్రెగ్నెంట్గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం సమంత చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. మేకోవర్ కూడా అవుతుంది.