లేడీ ఓరియంట్డ్ గా వచ్చిన సమంత ప్రధాన పాత్రలో వచ్చిన 'యశోద' మూవీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట్లో యావరేజ్ ఫిలిం అని టాక్ వచ్చినా కమర్షియల్ గా సినిమా సక్సెస్ ను తెచ్చుకుంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన యశోద నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
మంగళవారం లేదా బుధవారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం ఈవా అనే సరోగసీ సెంటర్ బ్యాక్డ్రాప్లో నడుస్తోంది. యశోద కోసం సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకుందంట. యశోద సినిమా కోసం తన బౌండరీస్ క్రాస్ చేస్తూ 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అయితే యశోద సినిమాపై వివాదాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడంతో హైదరాబాద్లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. ఈ వివాదం కాస్త.. సమంత యశోద సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు ఆలస్యానికి కారణం అయ్యింది. దీంతో ఆ ఆస్పత్రి వర్గాలతో యశోద నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు.