Yashoda Success meet : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. ఒకదాని తర్వాత మరోకటి ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. తాజాగా ఈమె యశోద సినిమాతో పలకరించనుంది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. (Twitter/Photo)
తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. (Twitter/Photo)
యశోద ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. లేడీ ఓరియంటెడ్ మూవీ అయిన ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ ) : రూ. 4.5 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) : రూ. 1.50 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 11.50 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ కలిపి రూ. 4 కోట్లు.. టోటల్ వాల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 15.50 కోట్లు.. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 16.50 కోట్లు రాబట్టాలి. మొత్తంగా సమంత ముందు పెద్ద టార్గెట్ ఉంది. (File/Photo)
ఈ చిత్రాన్ని ముందుగా ఆగష్టు 12న ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఏక కాలంలో విడుదల చేయాలనుకున్నారు. సామ్ ఇప్పటికే దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్గా సత్తా చూపెడుతునే ఉంది. ఇక గతేడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో సామ్‌కు నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. అందుకే ఇపుడు ఈమె నటించే సినిమాలన్నింటినీ హిందీలో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈసినిమా కోసం సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేసారు. అది తెరపై అద్భుతంగా ఉన్నాయి. (Twitter/Photo)