సమంత టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్. సమంత వరుసగా ఒకదాని తర్వాత మరోకటి ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. తాజాగా ఈమె యశోద సినిమాతో పలకరించనుంది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. (Twitter/Photo) Yashoda Photo Twitter
తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. (Twitter/Photo)
సరోగసీ బ్యాక్ డ్రాప్లో జరిగే మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1300 పైగా థియేటర్స్లో వాల్డ్ వైడ్గా రిలీజైంది. కు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. Samantha yashoda Twitter
క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. Photo :