ఇటీవల కాలంలో వచ్చిన భారీ సినిమాలకు మించి తొలి రోజు ఈ యశోద వసూళ్లు రాబట్టడం సమంత క్రేజ్‌కి నిదర్శనంగా మారింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుండటం సమంత అభిమానుల్లో జోష్ నింపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.