అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కూడా ఒకటి. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి జంటగా నటించగా.. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో సీజన్ 1 విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు IMDBలో 8.8/10 రేటింగ్ దక్కించుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. రెండో పార్ట్‌లో సమంత శ్రీలంక LTTE తీవ్రవాది పాత్రలో అలరించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వెబ్ సిరీస్ వల్లే సమంత .. నాగ చైతన్యకు మధ్య మనస్పర్థలు వచ్చిన విడాకులు తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సినిమాలకు ధీటుగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో 10 విభాగాల్లో నామినేట్ అయింది. ఓటీటీ వేదికగా పలువురు అగ్రహీరోలు, దర్శకులు ఎంట్రీ ఇవ్వడంతో వాళ్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ విభాగంలో అవార్డులను గతేడాది నుంచి ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ బెస్ట్ సిరీస్.. బెస్ట్ డైరెక్టర్ - రాజ్ అండ్ డీకే, సుపర్న్ ఎస్. వర్మ బెస్ట్ యాక్టర్ మేల్ - మనోజ్ బాజ్‌పేయ్ బెస్ట్ ఫీమేల్ - సమంత బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ - ఆశ్లేషా ఠాకూర్ బెస్ట్ సపోర్టింగ్ మేల్ యాక్టర్ - షరిబ్ హష్మి) బెస్ట్ ఒరిజినల్ స్టోరీ - సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే బెస్ట్ డైలాగ్స్ - (సుపర్న్ ఎస్ వర్మ, సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే, మనోజ్ కలైవనన్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే, సుపర్న్ ఎస్. వర్మ మొత్తంగా పది విభాగాల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ నామినేట్ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)