పౌరాణికం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Shekar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు (Dil Raju) సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానుంది.. (Twitter/Photo)
ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక వరుసగా ఈ సినిమా నుంచి పాటలను విడుదలచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి మల్లికా.. మల్లికా (Mallika Mallika - Lyrical ) అంటూ సాగే ఫస్ట్ లిరికల్ శాకుంతలం టీమ్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. .. (Twitter/Photo)
మణిశర్మ (Mani Sharma ) స్వరపరిచగా రమ్య బెహరా (Ramya Behara) పాడారు. చైతన్య ప్రసాద్ రచించారు. రుషి వనంలోన అంటూ సాగే రెండో పాట కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. మూడో పాటను విడుదల చేస్తున్నట్లు శాకుంతలం టీమ్ ప్రకటించింది. ఏలేలో ఏలే అంటూ సాగే ఈ పాట ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నట్లు పేర్కోంది Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు కొన్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్‌ను 20 కోట్లకు పైగా ధర పలికినట్లు టాక్. ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. Photo : Twitter
ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇతర పాత్రల్లో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Photo : Instagram
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్‌తో ఒక్కసారిగా హిందీలో కూడా పాపులర్ అయిన సామ్ ఈ సిరీస్ తర్వాత వరుస అవకాశాలను అందుకొంటూ వస్తున్నారు. దీనికి తోడు పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కారణంగా అటు హిందీ మాస్ ప్రేక్షకులకు దగ్గరైయారు సమంత. దీంతో సమంత హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా ఉంటూ అక్కడి రకరకాల షోల్లో పాల్గోంటున్నారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సమంత గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఓ హిందీ సినిమాలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవల హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆయుష్మాన్ ఖురానా సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హిందీ దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారట. ఆయన గతంలో ‘స్త్రీ’ అనే హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. Photo : Instagram
అయితే ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కూడా స్త్రీ సినిమా వలే హారర్ చిత్రం అని, ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని టాక్. జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో సమంత.. రాజ్ పుత్ యువ రాణితో పాటు దెయ్యం పాత్రలోను కనిపించనుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ ఎందుకు చక్కగా హీరోయిన్ పాత్రలు వేసుకోవచ్చుగా.. ప్రయోగాలు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.. Photo : Instagram
ఇక అది అలా ఉంటే సమంత గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ముంబైలో 30 కోట్లతో ఓ భారీ ఇల్లును తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంద్రభవనం లాంటీ ఆ ఇల్లు బీచ్ వ్యూతో ఉంటూ.. సకల సదుపాయాలతో ఉంటుందని సమాచారం. ఎంతో ఇష్టపడి సమంత ఈ ఇల్లును తీసుకుంటున్నట్లు వినికిడి. ప్రస్తుతం సమంత హిందీలో సూపర్ బిజీగా మారుతున్నారు. Photo : Instagram
సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సినిమాలను మరింత దూకుడుగా ఉన్నారు. అంతే దూకుడుగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాదు ఎప్పుడు లేని విధంగా మరింతగా బోల్డ్ ఫోటోషూట్లను చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఇక అది అలా ఉంటే ఓరామాక్స్ సర్వే ప్రకారం భారత్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా సమంత నిలిచారని తెలుస్తోంది. Photo : Instagram