పెళ్లి తర్వాత సమంత బాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయింది అంతేకాదు ఒకేసారి రెండు సినిమాలు చేస్తన్నట్టు ప్రకటించింది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.(Twitter/Photo)
మరోవైపు సమంత, నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేయనుంది. తాజాగా ఈ భామకు బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ముందుగా నయనతారను అనుకున్నా.. ఫైనల్‌గా సమంతను ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. Samantha Photo : Instagrarm
ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు చేరువైన సమంత.. ఈ సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఈ సినిమాకు ‘లయన్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియమణి నటిస్తోంది. ఈ సినిమా కోసం సమంతకు రూ. 7 కోట్ల వరకు పారితోషకం ఆఫర్ చేసినట్టు సమాచారం. (File/Photo)