Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. దీంతో చిత్రబృందం వరుసగా వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తోంది. Photo : Twitter
అందులో భాగంగా తాజాగా ఈ సినిమాలో సమంత డాన్స్ చేసిన పాపులర్ సాంగ్ ఊ..అంటావా మావ.. ఊహూ అంటావా మావా.. అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ పాటలో సమంత అందాల ఆరబోసి చేసి ఔరా అనిపించింది. ఈ పాట కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్ రాబట్టింది. Photo : Twitter
తాజాగా ఈ పాట కోసం సమంత ఏ రేంజ్లో కష్టపడిందో తెలిపే ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్‌తో కలిసి చేసిన డాన్స్ మూమెంట్స్‌ను చూసి అభిమానులు ఔరా.. ఓ పాట కోసం హీరోలు, హీరోయిన్లు ఏ రేంజ్లో కష్టపడతారన్నది మరోసారి తెలియవచ్చింది. సాంగ్ విడుదలైనప్పటి నుంచి ఎటు చూసిన మొత్తం పుష్ప ఐటెం సాంగ్ హావానే నడుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఇప్పటికి అక్కడ పుష్ప సినిమాకు 2 నుంచి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. పుష్ప ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా సోమవారం 2.75 కోట్లు, మంగళ వారం 2.50 కోట్లు, బుధవారం 2.25 కోట్లు, గురువారం 2.05 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా 72.49 కోట్లవరకు వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమా జనవరి 7 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడదులైన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా అన్ని భాషాల్లో కలిపి 300 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలింది టీమ్. అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. . Photo : Twitter
పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా ఒక హిందీలో తప్ప మిగితా అన్ని భాషాల్లో జనవరి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. దీంతో థియేటర్లో చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో ఈ శుక్రవారం చూడోచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్లకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు. Photo : Twitter
పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. Photo : Twitter
పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.Photo : Twitter
పుష్పను తమిళ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు. Photo : Twitter