యశోద లాంటీ సూపర్ హిట్ తర్వాత సమంత ప్రస్తుతం శాకుంతలం అనే ఓ పౌరాణికంలో నటిస్తోన్నసంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో సమంత టైటిల్ రోల్ ను పోషిస్తుంది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్’గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. . Photo : Twitter
శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తోంది టీమ్. ఈ పాటలను మణిశర్మ (Mani Sharma ) స్వరపరిచారు. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. Photo : Twitter
సమంత నటించిన మరో సినిమా యశోద. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నవంబర్ 11న విడులైంది. హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Photo : Twitter
అది అలా ఉంటే కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆమె ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అంతేకాదు చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేశాయి.. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేసింది.. Photo : Twitter
సరైనా సమాచారం లేకుండా సమంత ఆరోగ్యం గురించి ఇలా రూమర్స్ వ్యాప్తి చేయడంపై టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. సమంత తన అనారోగ్యం నుంచి కోలుకుని ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటోందని తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటోందని, దయచేసి ఎవరూ అటువంటి పుకార్లు నమ్మవద్దని సమంత టీమ్ తెలిపింది. దీంతో సమంత హెల్త్ విషయంలో వచ్చిన రూమర్స్‌కు చెక్ పడినట్లు అయ్యింది. Photo : Twitter
శాకుంతలంలో తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటించింది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. దేవ్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దుష్యంతుడిగా గుర్రం ఎక్కి వస్తున్న ఆయన లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. Photo : Instagram
ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్‌తో పాటు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. Photo : Twitter
ఈ సినిమాతో పాటు సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీరిస్‌లో భారీగా యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఈ నేపథ్యంలో సమంత మైనస్ 8 డిగ్రీల చలిలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ యాక్షన్ సీన్స్‌ను హలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యూనిక్ బెన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన సమంతకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.. Photo : Twitter
ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వైపు సమంత కండరాల వ్యాధి మైయోసైటిస్‌తో బాధపడుతున్నా.. వృత్తి విషయంలో వెనక్కు తగ్గటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత గత కొంత కాలంగా మయో సైటీస్ అనే వ్యాధి కారణంగా కొన్ని రోజుల షూటింగ్‌లు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు. Photo : Twitter