సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ భాషాల్లో రాణిస్తూ అలరిస్తున్నారు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. Photo : Instagram
ఈ ప్రకటన తర్వాత సమంత (Samantha)పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో కథనాలు, రూమర్స్ వచ్చాయి. అన్నింటిని ఓపికగా భరిస్తూ ముందుకు సాగుతున్నారు సమంత. ఇక అది అలా ఉంటే ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. విడాకుల తర్వాత, సమంత కెరీర్ మరింత పుంజుకుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఆమెకు పలు హిందీ ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు ఓ మూడు సినిమాలకు ఓకే కూడా చెప్పిందని సమాచారం. Photo : Instagram
అది అలా ఉంటే సమంత.. అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత మొదటిసారి ఆయన సోదరుడు అఖిల్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాదంతా మంచిగా జరగాలనీ, నువ్వు దేని కోసమైతే కలలు కంటున్నావో అవన్నీ నిజం కావాలని నేను దేవుడ్ని ప్రార్థిస్తాను అంటూ సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Photo : Instagram
ఇక మరోవైపు సమంత హిందీ సినిమాలతో బిజీగా ఉండడంతో ఇన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్న సామ్.. తాజాగా ముంబైలో ఓ కాస్లీ ఏరియాలో దాదాపు మూడు కోట్లు పెట్టి ఓ మంచి ప్యాలెస్ కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి కొన్ని రిపేర్స్ చేస్తున్నారట. సమంతకు టేస్ట్‌కు తగ్గట్లు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారట. అంతేకాదు ఇంకొన్ని రోజుల్లో ఆమె తన కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది. హిందీ సినిమాలు అయ్యేవరకు అక్కడే ఉండి షూటింగ్‌లకు హాజరుకానున్నారట సమంత. Photo : Instagram
ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి సమంత కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రెండు అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకానుంది. Photo : Instagram
అది అలా ఉంటే సమంత లాంటీ సెలెబ్రిటీస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుందన్న ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్‌లో సమంత ఒక్కో పోస్ట్‌కు రూ 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. అయితే ఇప్పుడు ఆ ఛార్జ్ పెరిగిందని టాక్. ఇప్పుడు సమంత ఒక్కో పోస్ట్‌కు ఏకంగా రూ.20 లక్షలకు వసూలు చేస్తుందట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Photo : Instagram
కానీ ఏవో కారణాల వల్ల ఆ ఆఫర్ సమంతకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతే సమంత దాదాపుగా ఖాయం అయ్యినట్లు టాక్. ఇక ఈ చిత్రం ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. Photo : Twitter
ఇక విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. Photo : Instagram
ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై యశోద అనే కొత్త చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు.. Photo : Instagram
ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.Photo : Instagram
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.Photo : Instagram
గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియన్ చిత్రం (Shaakuntalam) మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ రమణీయ ప్రేమకావ్యంలో (Samantha Ruth Prabhu) సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. Photo : Instagram
ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ (Shaakuntalam) ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు టీమ్. ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్‌తో కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ పతకాలపై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. Photo : Instagram
అయితే ఈ సినిమా కంటే ముందు గుణ శేఖర్ హిరణ్య కశిప అనే ఓ భారీ సినిమాను ప్రకటించారు. ఆయన ఎప్పటినుండో ఈ సినిమాను తెరకెక్కించాలనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రానా ప్రధాన పాత్రలో ఈ సినిమాను ప్రకటించారు కూడా. పురాణాలలో శివ భక్తుడు ప్రహాల్లద, రాక్షస రాజు హిరణ్యకశిపుడు మధ్య జరిగే సన్నివేశాలతో గుణ శేఖర్ ఈ కథను అల్లుకున్నారు గుణ శేఖర్. . Photo : Instagram
ఐతే ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం అవుతున్నా.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో గుణ శేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను మొదలు పెట్టి పూర్తి చేశారు. ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కవాతుల రెండు కాదల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా డబ్ చేస్తున్నారు. Photo : Instagram