ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత (Samantha Ruth Prabhu:).. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడారు. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు. అందులో భాగంగా ఆమె తాజాగా నటించిన సినిమా యశోద (Yashoda). ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : TwitterPhoto : Twitter
ఇక అది అలా ఉంటే సమంత తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం సిటాడెట్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గోంటున్నట్లు ఓ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇది చూసిన నెటిజన్స్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు మాత్రం డేట్స్ ఇవ్వవు కానీ.. వెబ్ సిరీస్ కోసం ఇస్తావా... ఇక్కడి ప్రోడ్యూసర్స్కు ఎంత నష్టం వస్తుందో తెలియదా.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమంత గత కొంత కాలంగా కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఎటువంటి షూటింగ్లో పాల్గోనడం లేదు Photo : Twitter
సమంత ఆరోగ్య కారణాల వల్లే ఖుషి సినిమా గత కొన్ని నెలలుగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె విజయ్ దేవరకొండ సినిమాకు కాకుండా ఓ వెబ్ సిరీస్‌కు డేట్స్ ఇవ్వడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.. మరికొంత మాత్రం ఏది తెలియకుండా ఎందుకు కామెంట్స్ అంటూ.. బహుశా వెబ్ సిరీస్ అవుట్ డోర్ కాకుండా ఇండోర్ షూట్ కావోచ్చు.. అందుకే ఆమె తన ఆరోగ్య కారణాల వల్ల, ఆషూట్కు ఓకే చెప్పి ఉండవచ్చని.. ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయని ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత టాపిక్ మరోసారి వైరల్‌గా మారింది. Photo : Twitter
ఇక సమంత నటిస్తోన్న మరో భారీ సినిమా శాకుంతలం (Shaakuntalam ). పౌరాణికం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుణ శేఖర్ (Guna Shekar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు (Dil Raju) సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానుంది. Photo : Twitter
దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ విడుదలైంది. మల్లికా.. మల్లికా (Mallika Mallika - Lyrical ) అంటూ సాగే ఈ పాటను మణిశర్మ (Mani Sharma ) స్వరపరిచగా రమ్య బెహరా (Ramya Behara) పాడారు. చైతన్య ప్రసాద్ రచించారు. మల్లికా..మల్లికా అంటూ సాగే ఈ మెలోడి ఎంతో మధురంగా ఉందని అంటున్నారు నెటిజన్స్. యూట్యూబ్‌లో తాజాగా విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషాల్లో విడుదలైంది. Photo : Twitter
ఇక శాకుంతలం విషయానికి వస్తే.. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజాగా యశోద సినిమా చేసిన సంగతి తెలిసిందే. . Photo : Twitter
మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నవంబర్ 11న విడులైంది. హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Photo : Twitter
ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్, డికెలతో సమంత చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. Photo : Twitter
అది అలా ఉంటే కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆమె ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అంతేకాదు చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేశాయి.. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేసింది.. Photo : Twitter
సరైనా సమాచారం లేకుండా సమంత ఆరోగ్యం గురించి ఇలా రూమర్స్ వ్యాప్తి చేయడంపై టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. సమంత తన అనారోగ్యం నుంచి కోలుకుని ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటోందని తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటోందని, దయచేసి ఎవరూ అటువంటి పుకార్లు నమ్మవద్దని సమంత టీమ్ తెలిపింది. దీంతో సమంత హెల్త్ విషయంలో వచ్చిన రూమర్స్‌కు చెక్ పడినట్లు అయ్యింది. Photo : Twitter
ఇక సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’. నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా నవంబర్ 4న వెండితెరపైకి రాబోతుందని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఆ డేట్‌కు రావడం లేదని తెలిపారు ప్రోడ్యూసర్స్. అసలు విషయానికి వస్తే.. నవంబర్ 4 నాటికి ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడం లేదని... వాయిదా వేసి ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. (Twitter/Photo)
ఈ సినిమాలో తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటించింది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. దేవ్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దుష్యంతుడిగా గుర్రం ఎక్కి వస్తున్న ఆయన లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. Photo : Instagram
ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్‌తో పాటు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. Photo : Twitter