అయితే సమంత మయోసైటిస్ వ్యాధికి అమెరికా వెళ్లారు. అక్కడ ఆమె చికిత్స చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే చికిత్సను ఇక్కడ ఇండియాలో కూడా కంటిన్యూ చేసింది సమంత. అయితే ఇంగ్లీష్ మెడిసన్ తో వ్యాధి నయం కాకపోవడంతో... సమంత వైద్యం కోసం కేరళకు వెళ్లిందని కూడా సమాచారం వచ్చింది. అక్కడ ఆమె ఆయుర్వేద చికత్స తీసుకుంటుందని తెలిసింది.
అయితే తాజాగా సమంత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు మరోసారి వస్తున్నాయి. ఆమెను పరిస్థితి దిగజారడంతో మెరుగైన చికిత్స కోసం దక్షిణా కొరియా దేశానికి తరలించినట్టుగా చెబుతున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న సౌత్ కొరియాకు తరలించినట్టుగా సమాచారం.
అయితే సమంత అనారోగానికి డిప్రెషన్ కారణమని తెలుస్తోది. నాగచైతన్యతో విడిపోయాక సమంత బాగానే కృంగిపోయింది. డిప్రెషన్ కు గురైంది. ఈ క్రమంలోనే భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెంచింది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురైంది సామ్. ఈ క్రమంలోనే సమంతకు ఈ 'మయోసైటిస్' అనే అరుదైన ప్రాణాంతక చికిత్స అందుబాటులో లేని 'కండరాల క్షీణత' వ్యాధి సోకినట్టు సమాచారం.
అమెరికాలో కూడా ఈ మయోసైటిస్ వ్యాధికి చికిత్స లేదట.. ఒక్క దక్షిణకొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉందట.. అక్కడ కండరాలక్షీణతకు చికిత్స ఉందని తెలియడంతో సమంత వెళ్లినట్టు సమాచారం. స్పెషల్ ట్రీట్ మెంట్ తీసుకొని ఆరోగ్య సమస్యలను తీర్చుకోవడం కోసమే సమంత వెళ్లిందని.. ఆమె పరిస్థితి రోజురోజుకు సీరియస్ గా మారుతోందని సమాచారం.
అయితే ఏ ట్రీట్ మెంట్ తీసుకున్నా సరే.. సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె వ్యాధి నయం అయ్యి ఆమె త్వరగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నారు. సమంత యశోద సినిమా విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.