Samantha: సమంత సందేశంతో అంతా ఖుషీ.. ఇలా చెప్పేసిందా..?
Samantha: సమంత సందేశంతో అంతా ఖుషీ.. ఇలా చెప్పేసిందా..?
Vijay Devarakonda | Samantha: ఖుషీ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ కి సమంత ఓ సందేశం పెట్టిందని సమాచారం.
తనదైన నటనతో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఖుషీ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
2/ 9
ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయనే టాక్ బయటకు రావడంతో అటు సమంత, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన అప్డేట్ ఇరువురి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది.
3/ 9
ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయమై అందరిలో అనుమానాలున్నాయి. ఇటీవలే తాను మాయోటైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పి షాకిచ్చింది సమంత. అప్పటి నుంచి ఆమె హెల్త్ ఇష్యూపై బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.
4/ 9
యశోద మూవీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న సమంత.. ఖుషీ సినిమాకు ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసుకుందని, ఆరోగ్యం పూర్తిగా నయమయ్యేకే సినిమా సెట్స్ పైకి వస్తానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఖుషీ టీమ్ కి ఓ మెసేజ్ ఇచ్చిందట సామ్.
5/ 9
తన వల్ల టీమ్ అందరూ వెయిట్ చేయడం ఇష్టపడని సమంత.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయండని, తాను షూటింగ్ కి రావడానికి సిద్దమే అని చెప్పిందట. దీంతో ఖుషీ తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్.
6/ 9
సెట్స్ మీదకు రావడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ 14 నుంచి 'ఖుషి' కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. కాకపోతే అదే రోజు నుంచి సమంత షూటింగులో జాయిన్ అవుతారా? లేకపోతే కాస్త టైమ్ తీసుకుని సెట్స్‌కు వస్తారా? అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
7/ 9
శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ ఖుషీ సినిమాను రూపొందిస్తున్నారు. లైగర్ తర్వాత ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడం, పైగా ఇందులో సమంత కూడా భాగం అవుతుండటంతో టాలీవుడ్ జనాల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.
8/ 9
ఓ వైవిద్యభరితమైన కథతో ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట శివ నిర్వాణ. ఖుషి అనే పేరుతో తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా కాశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
9/ 9
అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారట.