Samantha | సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఇన్నేళ్లలో సమంత తన సినిమాలకి ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పర్చుకోవడమే కాదు తనకంటూ సెపరేటు ప్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతుంది. రీసెంట్గా తనకో వ్యాధి ఉన్నట్టు చెప్పి షాక్ ఇచ్చింది. తాజాగా దానికి సంబంధించిన విషయాన్ని మీడియాకు పంచుకుంది.
సమంత విషయానికొస్తే.. ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఇన్నేళ్లలో సమంత తన సినిమాలకి ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పర్చుకోవడమే కాదు తనకంటూ సెపరేటు ప్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది.
ఇక నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘ఈగ’లో ప్రేమికుడిని కొల్పోయిన యువతిగా అద్భుతంగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఈగ సహాయంతో పగ తీర్చుకున్న ప్రియురాలు బిందుగా సమంత నటన ఆకుట్టుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో మరదలు శశిగా గ్లామర్ ఒలకబోస్తూనే తనదైన నటనతో మెప్పించింది.
సమంత.. కరోనా సమయంలోనే ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. మరోవైపు ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్ అంటూ సందడి చేసింది. అటు అమెజాన్ కోసం సిటాడెట్ అనే మరో వెబ్ సిరీస్ చేయబోతుంది. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. తొలిసారి తన కెరీర్లో పౌరాణిక సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది సమంత.