సమంత, నిధి అగర్వాల్, మధ్యలో పూజా హెగ్డే .. ఇంతకీ ఈ ముగ్గురు మధ్య ఉన్న ఈ సంబంధం ఏంటో తెలుసా... ఈ ముగ్గురు తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన సినిమాలతో హీరోయిన్స్‌గా టాలీవుడ్లో అడుగు పెట్టారు.
2/ 14
నాగ చైతన్య నాన్న నాగార్జున, మేనమామ వెంకటేష్ బాటలో తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో సమంతను కథానాయికగా పరిచయం చేసిన ఘనత నాగ చైతన్యదే. ఆ తర్వాత వీళ్లిద్దరు నిజ జీవిత భాగస్వాములయిన సంగతి తెలిసిందే కదా. (File/Photo)
3/ 14
‘ఏమాయ చేసావే’ సినిమా తర్వాత వీళ్లిద్దరు ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’ సినిమాల్లో కలిసి నటించారు. ‘ఓ బేబి’ చిత్రంలో చైతూ గెస్ట్ రోల్లో కనిపించాడు. (Photo : Twitter)
4/ 14
నాగ చైతన్య మొదటి చిత్రం ‘జోష్’. ఈ చిత్రంతో రాధ కూతురు కార్తీక కథానాయికగా పరిచయం అయింది. (Twitter/Photo)
5/ 14
రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘బెజవాడ’ సినిమాతో అమలా పాల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసాడు. (Twitter/Photo)
6/ 14
అమలా పాల్ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. (Twitter/Photo)
7/ 14
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పూజా హెగ్డే తెలుగు తెరకు పరిచయం అయింది. (Twitter/Photo)
8/ 14
‘ఒక లైలా కోసం’ సినిమా తర్వాత పూజా హెగ్డే కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతోంది. అంతేకాదు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ బుట్టబొమ్మ. (Twitter/Photo)
9/ 14
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ మూవీతో మడోనా స్టెబాస్టియన్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అయింది. (Twitter/Photo)
10/ 14
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో మంజిమా మోహన్ టాలీవుడ్లో లెగ్ పెట్టింది. (Twitter/Photo)
11/ 14
చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్‌కు పరిచయం అయింది. (Twitter/Photo)
12/ 14
ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. (Twitter/Photo)
13/ 14
మరోసారి నాగ చైతన్య, నిధి అగర్వాల్‌తో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం.. (Twitter/Photo)
14/ 14
నాగ చైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మజిలీ’ సినిమాతో దివ్యాంశ కౌశిక్ అనే కొత్త అమ్మాయిని తెలుగు తెరకు పరిచయం అయింది. (File/Photo)