అయితే మంచి అంచనాల నడుమ విడుదలై ఈ సినిమాకు హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. Photo : Twitter
యశోద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9.30 కోట్లు షేర్, 16.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో 4.55 కోట్లు, సీడెడ్‌లో 95 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.36 కోట్ల షేర్ సాధించింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 56 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 34 లక్షలు, గుంటూరులో 60 లక్షలు, కృష్ణా జిల్లాలో 65 లక్షలు, నెల్లూరు జిల్లాలో 29 లక్షల షేర్ వసూలు చేసింది.
క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు.