Samantha : బ్యాక్ లెస్ వైట్ టాప్ లో రాజ హంసలా మెరిసిపోతున్న సమంత..

Samantha : "ఏమాయ చేశావే" అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవడంతో పాటు ప్రేక్షకులందరినీ మాయ చేసేసింది సమంత (Samantha). ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె హవా తెలుగుకే పరిమితం కాలేదు. కోలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ మధ్యనే డిజిటల్ వరల్డ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులోనూ సత్తా చాటిన సమంత.. దేశం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇక, ఈ మధ్య హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సామ్.