Samantha lastest photo shoot: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతోనే కాదు డిజిటల్ మీడియాలోనూ బిజీ అయిపోయింది. గతేడాది వరకు కూడా సినిమాలు చేసిన సమంత.. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఫోకస్ అంతా చిన్నితెరపై పెట్టింది. అందుకే అక్కడ్నుంచి ఈమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఓటీటీలో కూడా అడుగుపెట్టిన సమంత.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మాన్-2’ అనే వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా కొత్త కొత్ ఫోటోలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది అందాల భామ..
మరోవైపు ఆ మధ్య తన ట్విట్టర్ ఖాతాలో అక్కినేని అనే పదాన్ని సమంత తొలగించేయడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చైతూతో దిగిన ఏ ఒక్క పిక్ షేర్ చేయకపోవడం, దానికితోడు ఎప్పుడు చైతూని వెంటబెట్టుకొని టూర్స్ వేసే సామ్.. రీసెంట్గా ఒంటరిగా టూర్ వేయడం లాంటి పరిణామాలతో నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం చర్చల్లో నిలిచింది.