సమంత.. టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేసిన ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఓ రేంజ్లో పాపులర్ అయ్యారు. చెప్పాలంటే కెరీర్ మొత్తంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా మరో ఎత్తు. ఆ ఒక్క పాటతో ఆమెకు సూపర్ క్రేజ్ వచ్చింది. కాగా సమంత మరోసారి అలాంటీ పాటలో కనిపించనుందని తెలుస్తోంది. Photo : Twitter
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్లో మెరిసింది. ఈ సినిమా, డైలాగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో సమంత ఐటం సాంగ్ కూడా అంతే హిట్ అయ్యింది.
సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. Photo : Twitter