సెట్స్ లో అల్లు అర్హ తెలుగు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా అనిపించిందని సమంత చెప్పింది. వందల మంది ముందు ఏ మాత్రం భయపడకుండా అల్లు అర్హ డైలాగ్స్ చెప్పిందని సమంత తెలిపింది. ఈ రోజుల్లో పిల్లలకు ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది కానీ అర్హకి తెలుగు అంత బాగా నేర్పించిన అల్లు అర్జున్, స్నేహరెడ్డిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి అని పేర్కొంది సామ్.
ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఫైనల్ కాపీ చూసిందట సామ్. దర్శకుడు గుణశేఖర్ గారు ఎంతో బ్యూటిఫుల్ గా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. ఈ సినిమాకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నా అని సమంత చెప్పింది.