Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలై వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత చైతూకు విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. విడాకుల తర్వాత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. (Instagram/Photo)
ఇక విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. Photo : Instagram
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో 'యశోద' ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్గా హైదరాబాద్‌లో పది రోజుల పాటు 'యశోద' యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్లో జరిగే షెడ్యూల్లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు.
ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.Photo : Instagram
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.Photo : Instagram