SAMANTHA FIRST SALARY CRAZY LIFE SECRETS OF STAR HEROINE SLB
Samantha: 500 రూపాయల కోసం ఆ పని! ఇప్పుడు కోట్లతో ప్రయాణం.. అవాక్కయ్యే లైఫ్ సీక్రెట్స్
Samantha First Salary: ప్రస్తుతం సమంత (Samantha Ruth Prabhu) ఒక సినిమా చేయటానికి దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. దీంతో పాటు స్పెషల్ సాంగ్స్, యాడ్ షూట్స్ ద్వారా కోట్లలో గడిస్తోంది. అమ్మడి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్న సమంత.. తొలి సంపాదన కేవలం 500 రూపాయలు మాత్రమే అనేది కొందరికే తెలుసు.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సుఖం అనేవి రెండూ ఉంటాయి. సుఖదుఃఖాల ప్రయాణమే జీవితం. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఎంతోమంది తారలు ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళే. ఆ లిస్టులో సమంత కూడా ఉంది.
2/ 9
తెలుగు తెరపై కాలుమోపిన అనతికాలంలో స్టార్ స్టేటస్ పట్టేసిన సమంత.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన మార్క్ చూపించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది.
3/ 9
ప్రస్తుతం సమంత (Samantha Ruth Prabhu) ఒక సినిమా చేయటానికి దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. దీంతో పాటు స్పెషల్ సాంగ్స్, యాడ్ షూట్స్ ద్వారా కోట్లలో గడిస్తోంది. అమ్మడి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
4/ 9
అయితే ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్న సమంత.. తొలి సంపాదన కేవలం 500 రూపాయలు మాత్రమే అనేది కొందరికే తెలుసు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా అప్పట్లో సమంత సంపాదన ఇంతే అనేది మాత్రం నిజం.
5/ 9
సమంత హయ్యర్ సెకండరీ స్కూల్ చదివే సమయంలో ఓ ఈవెంట్లో అతిథులను ఆహ్వానించే పనికి వెళ్లిందట. ఆ పనికి ఆమెకు ఇచ్చిన జీతం కేవలం 500 రూపాయలు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆమెనే స్వయంగా వెల్లడించింది. ఓసారి అభిమానులతో చిట్ ఛాట్ చేస్తున్న సమయంలో ఈ లైఫ్ సీక్రెట్ బయటపెట్టింది సామ్.
6/ 9
అప్పట్లో 500 కోసం ఆ పని చేసిన సమంత రేంజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇందుకు కారణం ప్రొఫెషన్‌పై ఆమెకున్న పట్టుదల, కృషి అని చెప్పుకోవచ్చు. ఎవరెన్ని మాట్లాడినా ప్రొఫెషన్ విషయంలో తనకు నచ్చిందే చేస్తూ వస్తోంది సమంత.
7/ 9
ఇక సమంత జీవితంలో డివోర్స్ అనే ఓ చేదు అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్.. వివాహం జరిగిన నాలుగేళ్లలోనే ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. వీరిద్దరి విడాకులపై ఎన్ని రూమర్స్ వచ్చినా పెద్దగా లెక్కచేయకుండా కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత.
8/ 9
ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా పూర్తి చేసింది సమంత. రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీతో తొలిసారి పౌరాణిక పాత్రలో అలరించబోతోంది సమంత. ప్రస్తుతం యశోద అనే సినిమాలో నటిస్తోంది.
9/ 9
అలాగే యువ హీరో విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న ఖుషి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్గా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ సమంత చేతిలో ఉన్నాయి.