సమంత, నాగచైతన్యలు((Naga Chaitanya) గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే (Yeh Maaya Chesave) చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. విడాకుల తర్వాత తొలిసారి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. (Twitter/Photo)
ఆ తర్వాత సామ్,చైతన్య ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించారు. అయితే 2015లో నాగ చైతన్య బర్త్ డే రోజు విష్ చేస్తూ సమంత (Samantha) చేసిన ట్వీట్.. వారి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి తెర తీసింది. ఆ ట్వీట్లో సమంత.. నా అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొనడం పెద్ద సంచలనమైంది. తాజాగా సామ్ ‘మజిలీ’ 3 యేళ్ల సందర్భంగా సమంత.. సామ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. (File/Photo)
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళెందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెప్తూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. కచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం.పైగా ‘సూపర్ డీలక్స్’, ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో సామ్ ఇంట్లో చెప్పకుండా బోల్డ్‌గా నటించడం వంటివి కూడా కారణాలుగా కనపించాయి. (Twitter/Photo)
ఇక నాగ చైతన్య, సమంత.. పెళ్లి తర్వాత చేసిన తొలి సినిమా ‘మజిలీ’ కావడం విశేషం. ఆ తర్వాత నాగ చైతన్య.. సమంతతో కలిసి ‘ఓ బేబి’ చిత్రంలో నటించారు. అందులో లక్ష్మీ పాత్ర యంగ్ మారినపుడు సామ్ అయితే.. రాజేంద్ర ప్రసాద్ పాత్ర యంగ్‌గా మారితే నాగ చైతన్య అవుతారు. వీళ్లిద్దరు తమ నాలుగో వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా 4 రోజుల ముందు టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు.