Samanta with Upasana: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెళ్లి మెళ్లిగా బయటకు వస్తోంది. ఎలాగోలా విడాకుల తాలూకు విషయాలను మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది. మళ్లీ ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉండే ప్రయత్నాల్లో ముందుగు వేస్తోంది. గత విషయాలను త్వరలోనే మరచిపోయి తిరిగి యాక్టివ్ కావాలని చూస్తున్న సమంత.. తాజాగా దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంబరాల్లో మెగా కోడలు ఉపాసన, శిల్పా రెడ్డి ఇతరులు కూడా సందడి చేశారు.
తన స్నేహితులు శిల్పా రెడ్డి, ఉపాసనలతో కలిసి దీపావళి వేడుకను ఎంజాయ్ చేసిన సమంత ఆయా ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ మేరకు ఎప్పటిలాగే కొన్ని మోటివేషనల్ లైన్స్ రాసింది. ఆనందాన్ని మించిన ధనం లేదని, మనశ్శాంతిని మించిన విజయం లేదని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అలాగే దయా గుణాన్ని మించిన చల్లదనం లేదని సామ్ పేర్కొంది.
అలాగే బరువెక్కిన హృదయంతో ఓ విషయం కూడా రివీల్ చేసింది సమంత. ''దీపావళి కాంతుల వెలుగులు విరజిమ్మలేదు. స్వీట్లలో ఉన్న రుచి కరువైంది. సంవత్సరం ఆరంభంలో ఏదన్నా బాధ కలిగితే ఆ తర్వాత వచ్చే పండుగలన్నీ చిన్నవే. తనకుకు తెలుసు అతిత్వరలో ఆ బాధ నుంచి బయటపడి సంతోషంగా ఉంటా అని. మీరు కూడా త్వరలో ఆనందం పొందుతారని ఆశిస్తున్నా'' అని సమంత పేర్కొంది. దీంతో ఈ సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఉపాసనకు టాలీవుడ్ హీరోయిన్లు, ఇటు వ్యాపార వేత్తలు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో సైతం ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. మిగిలిన సందర్భాల్లో ఫోటోలను పెద్దగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయకపోయినా.. ఇలాంటి వేడుకలను మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. దీంతో మరోసారి రామ్ చరణ్ ఉపాసన ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి.
టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ అయిన మెగా కుటుంబలో అపోలో సంస్థల అధిపతికి మనవరాలు ఉపాసన.. చరణ్ కి భార్యగా చిరు ఇంటి కోడలిగా వెళ్లింది. మెగా ఫ్యామిలీతో ఉపాసన బాగా కలిసిపోయింది. ఆ ఫ్యామిలీలో ఏ ఈవెంట్ ప్లాన్ చేయాలన్నా.. ఉపాసనే ముందు ఉంటారు.. తాజాగా మెగా ఫ్యామిలీ దివాళి సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. దానికి ఉపాసన రామ్ చరణ్ లే హోస్ట్ చేశారు. ఆ సందడి ఇక్కడ ఫోటోల్లో క్లియర్ గా కనిపిస్తోంది. అంతమంది ఫోటోల్లో ఉన్న ఉపాసన ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.
సంమంతకి టాలీవుడ్ లో్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే చైతూతో విడిపోయిన తరువాత సమంత ఎక్కువ వెకేషన్స్, ఆధ్యాత్మిక యాత్రలు పూర్తి చేసుకుని.. మళ్లీ మామూలు స్థితిలోకి వస్తున్నారు. ఇక ఉపాసన, శిల్పా రెడ్డి లాంటి ఫ్రెండ్స్ తో ఎక్కువగా సద్దురు ప్రవచనాలు వినే సమంత.. తాజాగా రామ్ చరణ్ ఉపాసనల దివాళి ఫోటోల్లో మెరిసింది. రామ్ చరణ్ ఉపాసన, ఉపాసన అత్తమ్మ సురేఖ, తల్లితో ఉన్నపిక్స్, ఉపాసన చెల్లితో ఉన్ప పిక్స్‌తో పాటు.. శిల్పా రెడ్డి ఉపాసన సమంతల సెల్ఫీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి..