విడాకుల తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది సమంత. ముఖ్యంగా తాను చేస్తున్న పనులు.. ఒప్పుకుంటున్న సినిమాలు.. పెరుగుతున్న క్రేజ్ చూసిన తర్వాత కొన్ని రోజులుగా సమంత హాట్ టాపిక్ అయిపోయింది. మామూలుగానే సమంత ట్రెండింగ్. ఆమెకు ఉన్న ఫాలోయర్స్ చూస్తుంటేనే ఆ విషయం అర్థమైపోతుంది. సౌత్ ఇండియాలో సమంత కంటే సోషల్ మీడియా తోపు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో..? హీరోలు కూడా ఈమె కంటే తక్కువే. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తుంది మాజీ అక్కినేని కోడలు.
ఇన్‌స్టాలో ఈమెకు ఏకంగా 20 మిలియన్ ఫాలోయర్స్ దాటిపోయారు. సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ ఎంజాయ్ చేస్తుంది స్యామ్. ఏ విషయమైనా ముందుగా అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ. తన విడాకుల విషయం కూడా ముందుగా సమంతనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాతే నాగ చైతన్య కూడా అధికారికంగా ప్రకటించాడు. విడాకుల తర్వాత సమంత చాలా మారిపోయింది. ముఖ్యంగా టూర్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది స్యామ్.
మునపటిలా ఇప్పుడు లేదంటూ ఆమె సన్నిహితులే చెప్తున్నారు. చాలా చలాకీగా ఉండే స్యామ్.. విడాకులు ప్రకటించిన కొన్ని రోజుల వరకు కూడా కాస్త మూడీగా కనిపిస్తుందని.. షూటింగ్స్‌లో కూడా దిగాలుగా కూర్చుంటుందని యూనిట్ చెప్పారు. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ శాకుంతలంతో పాటు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న యశోద సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో విఘ్నేష్ శివన్ సినిమాతో పాటు డ్రీమ్ వారియర్స్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒక్కో సినిమా కోసం ఏకంగా 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది సమంత. అయితే ఈ సినిమా షూటింగ్స్ సమయంలో షాట్ పూర్తైన తర్వాత ఒంటరిగానే కూర్చోడానికి సమంత ఇష్టపడుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇదివరకు షూటింగ్ సెట్లో సమంత ఉందంటే చాలా సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అది మాయమైందని తెలుస్తుంది. అయితే మెల్లగా తనలోని ఒంటరితనం బయటికి పంపిస్తూ.. సందడిగా మారిపోతుంది సమంత. పాత స్యామ్‌ను బయటికి తీసుకొస్తుంది.
ఎంతైనా పదేళ్ల స్నేహం.. నాలుగేళ్ళ వివాహ బంధం విడిపోయినపుడు ఆ మాత్రం బాధ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఎక్కువగా తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి టూర్స్‌కు వెళ్తుంది సమంత. ఆ మధ్య నార్త్ ఇండియాలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శించింది సమంత. ఆ తర్వాత గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసింది. బికినీ ఫోటోలను కూడా షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.
విడాకుల తర్వాత కొన్ని రోజుల పాటు డిస్టర్బ్డ్గా కనిపించిన సమంత గుళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకుని ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. మానసిక ప్రశాంతత కోసమే ఇలా తీర్థయాత్రలకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు సినిమాల షూటింగ్స్ చేసుకుంటూనే.. మరోవైపు టూర్స్ కూడా వెళ్లి ఫోటోలను అప్లోడ్ చేస్తుంది సమంత.
కాస్త మనసు కుదుట పడిన తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేయనుంది ఈ భామ. అప్పటి వరకు దర్శక నిర్మాతలు కూడా ఈమెను డిస్టర్బ్ చేయడం లేదు. పరిస్థితులను అర్థం చేసుకుని ఆమె చెప్పినట్లే చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈమె ఫారెన్ టూర్లోనే ఉంది. అక్కడే ఉండి తన ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమెను చూసి అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.