నాకెంతో ఇష్టమైన జిలేబీ తినేందుకు ఎప్పుడూ ఒప్పుకోని జునైద్.. ఇప్పుడు ఆయనే స్వయంగా జిలేబీ తీసుకొచ్చి నా నోరు తీపి చేశారు. గత కొన్ని రోజులుగా నా కష్టసుఖాల్లో వెన్నంటి నిలబడిన వారిలో నువ్వూ ఒకడివి. లక్ష్యాన్ని మధ్యలో వదిలేయకుండా వెన్నంటి నిలిచి విజయం వైపుకు తీసుకెళ్ళావు. కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో ధైర్యం చెబుతూ నా వెంటే ఉన్నావు. నాతో వర్కవుట్స్ చేయించి యాక్షన్ సీన్స్ బాగా వచ్చేలా చేశావు, నీ వల్లే ఇలా మారా.. థాంక్యూ అంటూ సమంత పోస్ట్ పెట్టింది.
ఇటీవల కాలంలో వచ్చిన భారీ సినిమాలకు మించి తొలి రోజు ఈ యశోద వసూళ్లు రాబట్టడం సమంత క్రేజ్‌కి నిదర్శనంగా మారింది. సమంత, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన యశోద సినిమాకు హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహించారు. సరోగసీ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుండటం సమంత అభిమానుల్లో జోష్ నింపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సమంత యాక్షన్ సినిమాకు మేజర్ అసెట్ అని రివ్యూస్ వచ్చాయి.