ఈ నేపథ్యంలో తాజాగా ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్ పట్ల సమంత స్పందిస్తూ ఎమోషనల్ అయింది. గతంతో పోల్చితే ఈసారి సినిమాను ప్రమోట్ చేయడంలో మీ సహకారం ఎక్కువగా అందుతుందని ఆశిస్తున్నా. యశోద విడుదలకు ముందు మీరు నాపై చూపించిన ఆప్యాయతకు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు నా కుటుంబంతో సమానం. మీరంతా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నా.. థాంక్యూ ఆల్ అంటూ పోస్ట్ పెట్టింది సమంత.
హరి, హరీష్ అనే ఇద్దరు కొత్త దర్శకులు డైరెక్ట్ చేసిన యశోద సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించింది. సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ బాణీలు కట్టారు.