అయితే ఏమైందో ఏమో కానీ.. గతేడాది అకస్మాత్తుగా వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. గతేడాడి అక్టోబర్లో తాము విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సమంత, చైతన్య. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే వీరి విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. వీరు కూడా ఎక్కడ దాని గురించి మాట్లాడటం లేదు.
సమంత మరియు నాగ చైతన్య ని పెట్టి ఒక సినిమా చెయ్యాలనే ఆలోచనలో ప్రముఖ టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది..విడాకులు తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తే అదొక క్రేజీ కాంబినేషన్ అవుతుందని..బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
చైతు పేరు ఎత్తితేనే సమంత మండిపడుతోంది. అంతేకాదు.. తనను నాగచైతన్య ఒకేగదిలో పెడితే మాత్రం అందులో పదునైన వస్తువులు ఏవీ లేకుండా చూసుకోవాలని కూడా సమంత కాఫీ విత్ కరణ్ షోలో చెప్పింది. దీంతో సమంతకు చైతన్యపై ఎంత కోపం ఉందో మనకు ఇట్టే తెలుస్తుంది. మరి అలాంటి సమయంలో ఆమె .. నాగచైతన్యతో కలిసి నటిస్తుందని అభిమానులు ఏ మాత్రం అనుకోవడం లేదు.