సమంత అక్కినేని ఎక్కడ ఉంది.. ఈమె హైదరాబాద్లో ఉందా లేదా.. లేదంటే చెన్నైలో షూటింగ్ చేస్తుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సమంత హైదరాబాదులో లేదు. అలాగని చెన్నైలో కూడా లేదు. షూటింగ్ కూడా చేయడం లేదని తెలుస్తోంది. మరి అన్నీ మానేసి సమంత ఎక్కడికి వెళ్లినట్లు.. అసలు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక్కడ అన్నింటి కంటే విచిత్రమేంటంటే తన పర్సనల్ స్టాఫ్కు కూడా సెలవులు ఇచ్చి సమంత అక్కినేని ఎక్కడికో వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. తాను ఎక్కడికి వెళుతున్నాననే విషయం గురించి కూడా స్టాఫ్కు చెప్పలేదని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ప్రశాంతత కోసమే కొన్ని రోజులు బయటకు వెళ్లాలని అనుకుంటున్నట్లు సమంత సన్నిహితులు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది.
కొన్ని రోజులుగా సమంత చాలా సైలెంట్ అయిపోయిందని.. ఏదో తెలియని సందిగ్ధంలో ఉంది అంటూ ఆమెతో ఉన్న వాళ్ళే చెబుతున్న మాట. అంతేకాదు కొన్ని రోజులుగా కంగారు కంగారుగా ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి. అందుకే ఇవన్నీ వదిలేసి కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒప్పుకున్న సినిమాలు కూడా అందుకే వేగంగా పూర్తి చేస్తుంది సమంత.
సమంత మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుంది అనే విషయంపై కూడా వాళ్లకు క్లారిటీ లేదని తెలుస్తోంది. ఉన్నట్లుండి తమకు సెలవులు ఇవ్వడంతో సమంత పర్సనల్ స్టాఫ్ కూడా షాక్ అవుతున్నారు. భర్త నాగ చైతన్యతో విడాకుల గురించి వస్తున్న వార్తలపై సమంత చాలా డిస్ట్రర్బ్ అయ్యిందని.. బహుశా దీని గురించే ఆమె కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చైతూతో విడాకుల గురించి స్పందించాలని కొందరు మీడియా ప్రముఖులు ఈమెను సంప్రదించినా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు.