Samantha Akkineni: సమంత అక్కినేని ప్రస్తుతం సినిమాలతో కాదు కానీ డిజిటల్ మీడియాలో బిజీ అయిపోయింది. గతేడాది వరకు కూడా సినిమాలు చేసిన అక్కినేని కోడలు ఇప్పుడు మాత్రం తన ఫోకస్ అంతా చిన్నితెరపై పెట్టింది. అందుకే అక్కడ్నుంచి ఈమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మెన్ 2లో నటించింది. ఇందులో మనోజ్ బాజ్పెయీ, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఈ మధ్యే విడుదలైన ప్యామిలీ మ్యాన్ 2కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు అదిరిపోయే హాట్ షో చేసింది.
సమంత అక్కినేని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. అన్నింటికి మించి ఈమె వర్కవుట్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అభిమానులకు. దానికితోడు మధ్యలో అప్పుడప్పుడూ సూపర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లి చైతూతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ భామ.