Samantha Akkineni : సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సీరిస్‌లో సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించింది. రాజీ పాత్రలో పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్, డీ గ్లామర్ లుక్‌లో నటిస్తూ వావ్ అనిపించింది. Photo: Instagram
ఇక గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ వెబ్ సీరిస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై, శ్రీలంక నేపథ్యంగా సాగింది. ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్లో మనోజ్ బాజ్ పాయ్ కనిపించి అదరగొట్టారు. Photo: Instagram
ఇక ఈ సీజన్లో సమంత రోల్ కొత్తగా యాడ్ అయ్యింది. ఊహించని విధంగా సమంత లుక్ ఉంది. సమంత శ్రీలంకన్ రెబల్ లుక్‌లో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటించినుందుకు నాలుగు కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. మామూలుగా సమంత రెండు కోట్లు వసూలు చేస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర కీలకం కనుక నిర్మాతలు నాలుగు కోట్ల వరకు ముట్ట జెప్పారని తెలుస్తోంది. Photo: Instagram
ఈ తాజా సీజన్‌ను కూడా తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహించారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. Photo: Instagram
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతంలలో కూడా నటిస్తున్నారు. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది. Photo: Instagram