SAMANTHA AKKINENI RECEIVES TV9 NAVA NAKSHATRA AWARD SHARES PICS ON INSTAGRAM SR
ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న సమంత..
Samantha Akkineni : 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్లో సమంతకు ఉంది. అది అలా ఉంటే తాజాగా టీవీ9 సమంతను నవ నక్షత్ర అవార్డ్‌తో సన్మానించింది. ఈ అవార్డ్‌ను సమంత తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్వీకరించింది. దానికి సంబందించిన కొన్ని ఫోటోస్‌ను సమంత తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.