Samantha - Naga Chaitanya: పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న హీరోయిన్ సమంత అక్కినేని(Samantha). ఓ పెద్దంటి కోడలు అయినా తర్వాత కూడా ఈమె గ్లామర్ షో చేస్తుంది.. సినిమాలు చేస్తుంది.. ముందున్నట్లే ఉంటుంది. అభిమానులతో చాట్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది సమంత.
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న హీరోయిన్ సమంత అక్కినేని. ఓ పెద్దంటి కోడలు అయినా తర్వాత కూడా ఈమె గ్లామర్ షో చేస్తుంది.. సినిమాలు చేస్తుంది.. ముందున్నట్లే ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు అభిమానులతో చాటింగ్ చేస్తూ తన ముచ్చట్లు కూడా షేర్ చేసుకుంటుంది సమంత.
2/ 8
ఖాళీ సమయంలో ఇంటిపైనే వ్యవసాయం చేస్తుంది. జిమ్‌లో గంటల తరబడి ఉండి ఫిట్ నెస్‌పై ఫోకస్ చేస్తుంది. ఇలా ప్రతీ విషయంలోనూ సమంత తనకు తానే పోటీగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా అభిమానులకు తన గురించి మరో మూడు విషయాలు చెప్పుకొచ్చింది స్యామ్.
3/ 8
తనలో తనకు నచ్చే మూడు అంశాలు ఇవే అంటూ చెప్పుకొచ్చింది. దాంతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలిపింది. భర్త నాగ చైతన్యతో అయ్యే గొడవల గురించి.. అప్పుడు అయ్యే కాంప్రమైజ్‌ల గురించి కూడా ఏ మాత్రం దాచుకోకుండా ఓపెన్ అయిపోయింది సమంత అక్కినేని.
4/ 8
ఈ అన్ని విషయాల గురించి సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి వ్యక్తికి కూడా తనలో ఏం యిష్టం అనేది తెలిసి ఉండటం ముఖ్యమంటుంది సమంత. అప్పుడే మన జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెప్తుంది ఈ బ్యూటీ.
5/ 8
తనలో తనకు నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే ఇష్టం అంటుంది. ఈ మూడు లక్షణాలు తనలో తనకు బాగా నచ్చుతాయి అని చెప్పింది. ఇది తనవరకు మాత్రమే అని.. ఆడియన్స్‌కు తనలో నచ్చే విషయాలు వేరేగా ఉండొచ్చని చెప్తుంది స్యామ్.
6/ 8
ఈ కరోనా కష్టకాలంలో కచ్చితంగా అంతా శారీరకంగా ఫిట్‌గా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటుంది సమంత. మానసికంగానూ ధృడంగా.. ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తుంది స్యామ్. అందుకే తాను రోజూ వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తుంటానని తెలిపింది.
7/ 8
ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని సీక్రేట్స్ బయటపెట్టింది. అయితే అలా గొడవ పడిన ప్రతీసారి ముందుగా తానే కాంప్రమైజ్ అవుతానంటుంది సమంత.
8/ 8
ఎందుకంటే తనకు సిగ్గు లేదంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది సమంత. దాంతోపాటు హిందీలో తొలిసారి ఈమె కనిపించిన మనోజ్ బాజ్పెయీ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.