నాగ చైతన్య, సమంత విడిపోతున్నారనే వార్తలు నాన్ స్టాప్‌గా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. దీనిపై అటు చైతూ కానీ.. ఇటు స్యామ్ కానీ స్పందించింది లేదు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఆ మధ్య ఓ సారి భర్త నాగ చైతన్యతో అయ్యే గొడవల గురించి.. అప్పుడు అయ్యే కాంప్రమైజ్‌ల గురించి కూడా ఏ మాత్రం దాచుకోకుండా ఓపెన్ అయింది సమంత అక్కినేని. అవిప్పుడు వర్కవుట్ అవుతాయా అనేది ఆసక్తికరమే.
చైతూతో సమంతకు మనస్పర్థలు వస్తున్నాయని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అలాంటిదేం లేదంటూ సన్నిహిత వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. కానీ చైతూ లేకుండా సమంత తొలిసారి పెళ్ళి తర్వాత గోవా టూర్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తుంది. అలాగే హాట్ ఫోటోషూట్స్‌తో రెచ్చిపోవడం కూడా ఆసక్తికరంగా మారుతుంది.
పెళ్లికి ముందు ఎలాగైతే రెచ్చిపోయేదో అలా ఇప్పుడు క్లీవేజ్ షో చేస్తూ మరీ రెచ్చిపోతుంది సమంత. పైగా తన పేరులో నుంచి అక్కినేని తీసేయడం కూడా చర్చకు దారి తీసింది. దీనిపై ఇప్పటి వరకు సరైన స్పష్టత ఇవ్వలేదు సమంత. మరోవైపు భర్త లేకుండా టూర్స్ వెళ్లడం కూడా అర్థం కాకుండా మారిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత అక్కినేని జంట విడిపోతున్నారని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.
ఇలాంటి సమయంలో సమంత చేసిన ఓ పని.. అభిమానుల్లో కొత్త ఆశలు పుట్టిస్తుంది. తాజాగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీన్ని రీ ట్వీట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పింది సమంత.
భర్త చైతూ ఈ ట్రైలర్ ట్వీట్ చేస్తే.. దాన్ని రీ ట్వీట్ చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. విన్నర్ అంటూ ఒకే మాటలో సినిమా గురించి చెప్పుకొచ్చింది స్యామ్. తన భర్తకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది సమంత. ఈ ట్వీట్‌తో తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పే ప్రయత్నమైతే చేసింది సమంత. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది చూడాలి.