Samantha Akkineni: సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను మాయమరిపిస్తున్న బ్యూటీ సమంత. ఇక ఇటీవలే ఉగాది సమయంలో సమంత తల్లి అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకు కారణం సమంత షేర్ చేసిన ఫోటోనే. ఇప్పుడు కూడా సమంత షేర్ చేసిన ఫోటో కారణంగా నెట్టింట్లో సమంత అభిమానులు రచ్చ చేస్తున్నారు. సమంత ప్రెగ్నెంట్ అంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం మరొకటి.. సమంత తల్లి ఫోటో తీసిందని.. ఫోటో క్లిక్డ్ బై మమ్మి అని షేర్ చెయ్యగా.. తల్లి కాబోతున్న అని సమంత చెప్పినట్టు ఉహించుకొని కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.