ఇంట గెలిచి...రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు, హీరోయిన్లు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది ఇంటర్నేషనల్ మూవీస్‌లో రచ్చ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మూవీస్ విషయానికొస్తే.. అమెరికా వాళ్లు తెరకెక్కించే చిత్రాలను బేసిక్‌గా హాలీవుడ్ చిత్రాలు అంటారు. అలాగే బ్రిటన్ సహా పలు దేశాలు సినిమాలు నిర్మిస్తోన్న వాటిని ఇంటర్నేషనల్ మూవీస్ అని చెప్పొచ్చు. తాజాగా సమంత ‘ది అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి ఓకే చెప్పింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది. (Twitter/Photo)
ప్రముఖ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఫిలిప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ మూవీలో సమంత మరోసారి హాట్ షోతో రెచ్చిపోనున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి నటించిన సామ్.. ఈ ఇంటర్నేషనల్ మూవీలో మరింత హాటుగా ఘాటుగా రెచ్చిపోయి యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
అటు రజినీకాంత్ ‘కాలాా’ ఫేమ్ హ్యుమా ఖురేషీ హాలీవుడ్లో‘ఆర్మీ ఆఫ్ డెడ్’ అనే వెబ్ సిరీస్‌తో హాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హ్యుమా ఖురేషీకి తొలి హాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం హ్యుమా ఆర్మీకి సంబంధించిన పలు అంశాల్లో ట్రేనింగ్ తీసుకుంది. (Twitter/Photo)