టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సమంతను లీడ్ రోల్లో పెట్టి ఆయన ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమా కోసం ఆయన ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించాడని వార్తలు వచ్చాయి.. దీనికి సంబంధించని ఓ వీడియోను గుణ శేఖర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో గతంలో షేర్ చేసుకున్నాడు. (Twitter/Photo)
ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంత్ పాత్రలో నటిస్తున్నాడు. దేవ్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. దుష్యంతుడిగా గుర్రం ఎక్కి వస్తున్న ఆయన లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లో అడవిలో గుర్రపు స్వారీ చేస్తున్న రాజుగా, మనోహరంగా మరియు పరాక్రమంగా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం మేకర్స్ శాకుంతలం సినిమా గ్రాఫికల్ వర్క్స్ లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అంతే కాకుండా దీనితో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మేకర్స్ స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. రుద్రమదేవి తర్వాత రానాతో హిరణ్య కశ్యప చేయాల్సి ఉన్నా కూడా అది కాదని శాకుంతలం మొదలు పెట్టాడు గుణశేఖర్. పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను తెరపై చూపించనున్నారు. Samantha Photo : Twitter