సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.ఈ యేడాది చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సల్లూ భాయ్.. త్వరలో ‘టైగర్ 3’, ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమాలతో పలకరించబోతున్నారు. (Twitter/Photo)
బాలీవుడ్లో అమీర్ ఖాన్ మినహా మిగిలిన హీరోలందరూ వరస సినిమాలతో బిజీగా ఉంటారు. అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు అయితే మూడు నాలుగేళ్లకు సరిపోయే ప్రాజెక్టులు సెట్ చేసుకుంటారు. ఒకేసారి అరడజన్ సినిమాలకు కమిట్మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ఏకంగా అర డజను పైగా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే రెండేళ్లు కండల వీరుడి అభిమానులకు అంతకంటే కావాల్సింది మరోటి లేదు అన్నట్లు వరస సినిమాలు చేస్తున్నాడు. అందులో క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సీక్వెల్స్ బాట ఎక్కువగా పడుతున్నాడు సల్మాన్.
కిసి కా భాయ్.. కిసీ కా జాన్ | ముందుగా ఈ సినిమాకు కభీ ఈద్ కభీ దివాళి అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత పేరు మార్చారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా ఫర్హాద్ సమ్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో 2023 ఈద్ పండగ రోజున విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. (Twitter/Photo)
టైగర్ 3: మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నాడు. టైగర్ సిరీస్లో వస్తోన్న మూడో సీక్వెల్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది 2023 దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. (Twitter/Photo)