Salman Khan Samantha: తాజాగా సమంత ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ పాటపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఎల్లలు దాటుతోంది. ప్రస్తుతం ఆమె జోష్ చూసి ఫిదా అవుతోంది సినీ లోకం. కేవలం ఆడియన్స్ మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీల చూపు కూడా సమంత వైపు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
2/ 9
కెరీర్ పరంగా మరింత ముందుకెళ్లాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది సామ్. ఈ మేరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తన విజయ సోపానంగా మార్చుకుంటోంది. పాత్ర ఏదైనా వెండితెరపై తన మార్క్ స్పష్టంగా కనిపించాలని తాపత్రయ పడుతోంది.
3/ 9
ఇందులో భాగంగా రీసెంట్గా పుష్ప సినిమాలో ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ అంటూ ఐటెం సాంగ్ చేసి యావత్ సినీ లోకం దృష్టి తనపై పడేలా చేసుకుంది. హుషారెత్తించే ఈ పాటలో సమంత కట్టు బొట్టుతో పాటు బన్నీతో ఆమె జోష్ స్పెషల్ అట్రాక్షన్ అయింది.
4/ 9
కాగా, తాజాగా సమంత ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ పాటపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
5/ 9
ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ ఓపెన్ అయ్యారు. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా? అని యాంకర్ వేసిన ప్రశ్నపై సల్మాన్ రియాక్ట్ అవుతూ.. 'ఊ అంటావా మావా' అనేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఒకరు ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.
6/ 9
సల్మాన్ ఫ్యాన్ పెట్టిన ఈ ట్వీట్ చూసి సామ్ ఉబ్బి తబ్బిబ్బయింది. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ లవ్ సింబల్ ఎమోజీస్‌తో పంచుకుంది. అంటే సల్మాన్ చూపిన ఆ ఇంట్రెస్ట్ సమంతను ఎంతో సంతోషపెట్టిందని చెప్పుకోవచ్చు.
7/ 9
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది సమంత. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన ఈ అమ్మడు.. యశోద, ఖుషి అనే సినిమా షూటింగుల్లో భాగమవుతోంది. దీంతో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టుల్లో సమంత నటిస్తోంది.
8/ 9
ది ఫ్యామిలీ మేన్ 2తో బాలీవుడ్ ప్రేక్షక లోకానికి బాగా దగ్గరైంది సమంత. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని టాక్. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ తోనే అని తెలుస్తుండటం ఆసక్తికర అంశం.
9/ 9
నాగ చైతన్యతో విడాకుల తర్వాత యమ స్పీడుగా సినిమాలు చేస్తూ వస్తోంది సమంత. ఎవరేమనుకున్నా నాకేంటి అనే కోణంలో దూసుకుపోతూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సమంత హవా నడుస్తోంది.