#SakshiAgarwal : సాక్షి అగర్వాల్ నైనిటాల్‌లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. చెన్నైలో ఎంబిఎ చేసింది. అందులో భాగంగా మొదట్లో మార్కెటింగ్ కన్సల్టెన్సీలో జాబ్ చేసి.. ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించింది. ఇక అక్కడినుంచి ఓ కన్నడ సినిమాలో నటించింది. ఆ తర్వాత సూర్యతో ఓ యాడ్‌లో కనిపించి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ తన సినీ కెరీర్‌ను పదిల పర్చుకుంది. సాక్షి పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కాలాలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ భామ ప్రస్తుతం సిండ్రెల్లా అనే తమిళ సినిమాలో రమ్య పాత్రలో నటిస్తోంది.