సినీ తారల పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. హీరోహీరోయిన్స్ ఏ ఇంటర్వ్యూకి వచ్చినా ఎక్కవగా వారి పర్సనల్ మ్యాటర్స్ పైనే ఫోకస్ పెడుతుంటారు. మరీ ముఖ్యంగా వాళ్ళ లవ్ స్టోరీ, పెళ్లి సంగతులను తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది సాయి పల్లవి (Sai Pallavi).
తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన గార్గి చిత్రాన్ని గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్లో లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాయి పల్లవి ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలు, ట్రైలర్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.