కాగా.. తారకరత్న ఆరోగ్యంపై అతని సోదరుడు చైతన్య కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తారకరత్న గుండెపోటు బారిన పడడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రస్తుతం ఆయన అవయవాలు అన్నీ బాగానే పని చేస్తున్నాయి. స్పృహలోకి వస్తే పూర్తి క్లారిటీ వస్తుంది. సోమవారం మరోసారి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని చైతన్య అన్నారు.
తారకరత్న కోమాలో ఉన్నారని చైతన్య కృష్ణ చెప్పారు. ఇప్పటికే బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు గుండెపోటుకు గురైన దగ్గరి నుండి బాలకృష్ణ అతని వెంటే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.