సాయి ధరమ్ తేజ్.. గతేడాది అనుకోకుండా హైదరాబాద్లో బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఆ ప్రమాదం నుంచి తేరుకోవడానికి దాదాపు యేడాది పట్టింది. ఈయన ప్రచారం చేయకుండానే ఈయన నటించిన రిపబ్లిక్ మూవీ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కమర్షియల్గా మాత్రమ అంతగా సక్సెస్ కాలేదు. (Twitter/Photo)
గతేడాది అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈయన్ని డిశ్చార్జ్ కూడా చేసారు. ఇదే విషయం అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి కన్ఫర్మ్ చేసాడు. అది కచ్చితంగా సాయికి మరో జన్మలాంటిదే.. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం అనేది నిజంగా పునర్జన్మ అంటూ ట్వీట్ చేసాడు చిరు. ఇక యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకోవడంతో పాటు సరైన కథలు కూడా లేకపోవడంతో ఇంత లేట్ అయిందని సాయి ధరమ్ తేజ్ సన్నిహితులు చెబుతున్నారు. (Twitter/Photo)